బతుకమ్మ సంబరాలు…హాజరైన గవర్నర్

163
kavitha
- Advertisement -

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ తమిళ సై సౌందర రాజన్.. మంచి జీవితాన్ని కోరుతూ చేసే సంబరం బతుకమ్మ అన్నారు. ప్రజలందరికీ సంతోషకరమైన జీవితం దక్కాలని అమ్మవారిని కోరుతున్నానని ఆకాంక్షించారు. బతుకమ్మ కి ప్రచారం కల్పించిన కవితకి శుభాకాంక్షలు చెప్పారు. బతుకమ్మ సంబరాల్లో ఆరోగ్యం దాగి ఉంది…దశాబ్దాల క్రితమే మన పూర్వీకులు ఆలోచించి ఈ వేడుకలో ఆరోగ్య సూత్రాలు మిళితం చేశారన్నారు.

కొత్త జెనరేషన్ వాళ్ళకి బతుకమ్మ పండుగని చేరువచేయడం ద్వారా వారికి ఆరోగ్యాన్ని అందించవచ్చు అన్నారు. బతుకమ్మ ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉందన్నారు.

గవర్నరుతో కలిసి బతుకమ్మను చేసుకోవడం సంతోషం అన్నారు జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బతుకమ్మ పాటలలో ఉన్న తెలుగు పాదాలపై పరోశోధన చేస్తే బాగుంటుందన్నారు. పాత బతుకమ్మ పాటలలో మనం మర్చిపోయిన అనేక పదాలు ఉన్నాయి .. వాటిపై పరిశోధన చేసి భాషను పరిపుష్టం చేయాలన్నారు.

- Advertisement -