తెలంగాణలో ఎన్నికల సంగ్రామం మొదలైంది. వచ్చే నెల 30 న ఎన్నికల పోలింగ్ జరగనుంది. దాంతో ఇక ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి సిద్దమౌతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అధికార బిఆర్‌ఎస్ ఎవరికి అందనంత వేగంగా ఎన్నికల రేస్ లో ముందుంది. ఈ నెల 15 నుంచి ఎన్నికల ప్రచారానికి బిఆర్‌ఎస్ శ్రీకారం చుట్టబోతుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న అధినేత కేసిఆర్ కోలుకోవడంతో బిఆర్‌ఎస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇక గతంలో మాదిరిగానే హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారానికి బిఆర్‌ఎస్ సిద్దమౌతోంది. 2014 ఎన్నికల్లోనూ, అలాగే 2018 ఎన్నికల్లోనూ హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు కేసిఆర్.
2014 ఎన్నికల్లో 63 స్థానాలు, 2018 ఎన్నికల్లో 88 స్థానాలు సొంతం కైవసం చేసుకున్నారు. దాంతో అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ ఈ ఎన్నికల ప్రచారాన్ని కూడా హుస్నాబాద్ నుంచే మొదలు పెట్టబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ 100 కు పైగా సీట్లు సాధించే దిశగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బిఆర్‌ఎస్ 100 కు పైగా సీట్లు సొంతం చేసుకోవడం కష్టమేమీ కాదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్, బిజెపి పార్టీలు అభ్యర్థుల ఎంపిక పైనే తలమునకలై ఉన్నాయి. నియోజిక వర్గాల వారీగా అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. పైగా ప్రజల్లో ఆ రెండు పార్టీలపై మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత నెలకొంది. పైగా కేసిఆర్ అందిస్తున్న సుపరిపాలనపై ప్రజలు ఎంతో సానుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తిరుగులేని విజయం నమోదు చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. మొత్తానికి ఎన్నికల ప్రచారానికి కేసిఆర్ రెడీ అవ్వడంతో అందరి దృష్టి ఎలక్షన్ క్యాంపైన్ పై పడింది.
Also Read:రాగిపాత్రలతో ఆరోగ్యం..