జమ్ముకశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్..

5
- Advertisement -

జమ్ముకశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ అయింది. భారీ వర్షాలతో రాంబాన్ జిల్లాల్లో విరిగిపడ్డాయి కొండచరియలు. 11 మంది మృతి చెందగా శిథిలాల కింద చిక్కుకున్నారు మరికొంత మంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండగా సహాయక చర్యలు కొనసాగనున్నాయి.

భారీ వర్షాల కారణంగా పరిస్థితి మరింత దిగజారుతుందని ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు 2014లో కశ్మీర్‌లో వరదలు వచ్చిన తర్వాత ప్రకటించిన రూ.80,000 కోట్ల ప్యాకేజీని జమ్మూ ప్రాంతానికి రెట్టింపు మంజూరు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు తెలిపారు.

ఈసారి జమ్మూ 2014లో కాశ్మీర్ కంటే పెద్ద వరదలను చూసిందని వివరించారు. దీనివల్ల భారీ విధ్వంసం సంభవించిందన్నారు. అందుకోసం రూ. 80,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్యాకేజీ అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు.జమ్మూ, ఉధంపూర్, కథువా, సాంబా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది.

Also Read:KTR:అసెంబ్లీ 15 రోజులు నడపాలి

- Advertisement -