రిజల్ట్స్‌కి ముందు సీన్ రివర్స్‌..!

392
kcr laxman
- Advertisement -

మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి టీఆర్ఎస్,బీజేపీ. ఎన్నికలకు ముందు ప్రతిసభలో బీజేపీ – టీఆర్ఎస్ మధ్య ఎలాంటి పొత్తూ లేదని చెప్పినా ప్రజలు మాత్రం నమ్మస్థితిలో లేరు.ఈ రెండు పార్టీల మధ్య అనధికారిక పొత్తు ఉందనేది బహిరంగ రహస్యమే. అయితే ఇదంతా ఎన్నికల ముందు వరకే. మరికొద్దిరోజుల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సీన్ రివర్సైంది.

బీజేపీకి దేశవ్యాప్తంగా గ్రాఫ్ పడిపోతుందని గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ ఇప్పటినుండే వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌ కేంద్రంలో కీలకంగా మారని పరిస్థితుల్లో అవసరమైతే ప్రత్యామ్నాయంగా యూపీఏ పక్షాలతో కలిసే అంశాన్ని కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పసుపుబోర్డు కోసం ప్రధాని మోడీపై నామినేషన్లు వేయించింది కమలనాథులు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందని టాక్‌ వినిపిస్తోంది. తమపైనే కత్తి దూస్తున్న టీఆర్ఎస్‌కి చెక్ పెట్టాలని భావించిన బీజేపీ నేతలు రాష్ట్ర బీజేపీ వర్గానికి కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారని సమాచారం.

ఇందులో భాగంగానే ఇంటర్ ఫలితాల్లో తలెత్తిన అవకతవకల్ని క్యాష్ చేసుకుంటూ బీజేపీ సడెన్‌గా ధర్నాలకు దిగడం వెనక హైకమాండ్ నుంచీ సడెన్‌గా వచ్చిన ఆదేశాలే కారణం అంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ప్రస్తుతానికి కేంద్రంలో కీలక మంత్రి పదవుల్ని రాబట్టడం ద్వారా తెలంగాణకు ఎక్కువ ప్రయోజనాల్ని కల్పించడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల్ని బట్టీ… ఏ పార్టీలు ఎటువైపు ఉంటాయన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -