కాంగ్రెస్‌లో కుమ్ములాట.. రేవంత్ ముందే త‌న్నుకున్న నేతలు..

83
Congress
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. నేతల మధ్య ఆధిప్యత పోరు ఆగేటట్టులేదనే చెప్పాలి. నిత్యం ఏదో ఒక చోట కాంగ్రెస్‌ నేతల మధ్య ఆధిప్యత పోరు రగులుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నువ్వానేనా అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. తాజాగా వరంగల్‌లో కాంగ్రెస్‌ నేతల మధ్య కొట్లాట జరిగింది. దీని బట్టి సూస్తే.. కాంగ్రెస్‌లో నేతల మధ్య అంతర్గతంగానే కాదు బహిరంగగానే కుమ్ములాట జరుగుతున్నాయి.

ఇక అసలు విషయానిస్తే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలోనే పార్టీకి చెందిన వ‌రంగ‌ల్ శాఖ నేత‌ల మ‌ధ్య ఘరణ చోటుచేసుకుంది. పార్టీకి చెందిన జంగా, నాయిని వ‌ర్గాల మ‌ధ్య ఈ ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఇరు వ‌ర్గాల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు రేవంత్ రెడ్డి ముందే ప‌ర‌స్ప‌రం దాడుల‌కు దిగారు. వ‌చ్చే నెల 6న వ‌రంగ‌ల్‌కు రాహుల్ గాంధీ రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రాహుల్ గాంధీ పాల్గొనే బ‌హిరంగ స‌భా వేదిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగ‌ణాన్ని పార్టీ కీల‌క నేత‌ల‌తో క‌లిసి రేవంత్ రెడ్డి గురువారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా జంగా, నాయినిల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకోగా… ఇరు వ‌ర్గాల‌కు చెంది‌న కార్య‌క‌ర్త‌లు త‌న్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో వ‌ర్గ పోరు పార్టీ అధిష్ఠానానికి త‌ల‌నొప్పిగా మారింది.

- Advertisement -