ఐపీఎల్ 2022: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న CSK

54
MI vs CSK
- Advertisement -

ఐపీఎల్ 2022 సీజన్‌లో నేడు మరో కీలక పోరు జరగనుంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.- చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది చెన్నై. చెన్నై సూపర్ కింగ్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్ ల్ని పక్కన పెట్టిన సీఎస్కే.. ప్రిటోరియస్, మిచెల్ శాట్నర్ లకు చోటు కల్పించింది.

ఇక, మూడు మార్పులతో ముంబై బరిలోకి దిగుతోంది. మెరిడిత్, హృతిక్ షోకిన్, డానియల్ సామ్స్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.టోర్నీలో అత్యధికంగా అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు.. ముంబై. నాలుగు టైటిళ్లతో తర్వాతి స్థానంలో ఉన్న జట్టు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌.

తుది జట్లు

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, మిచెల్ శాట్నర్ , డ్వేన్ ప్రిటోరియస్, మహీశ్ తీక్షణ, ముకేశ్ చౌదరి

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, డానియల్ సామ్స్, హృతిక్ సోకిన్, జస్‌ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్, జయదేవ్ ఉనాద్కత్

- Advertisement -