శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ రమణ..

114
cji ramana
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సీజేఐ రమణ. తిరుపతి పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం కుటుంబసమేతంగా తిరుమల చేరుకున్న రమణకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ పండితులు జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు వేదాశీర్వాదం అందించారు.

వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోండగా ఇన్న శ్రీవారిని 70,019 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.52 కోట్ల ఆదాయం వచ్చింది.

- Advertisement -