కేటీఆర్‌ని కలిసిన బాలయ్య..

102
ktr

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, నటసింహ నందమూరి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందూ.

ఇందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి, 25 లక్షలు సినీ కార్మికుల సంక్షేమానికి అందజేస్తానని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్‌ని కలిశారు బాలకృష్ణ . ప్రగతిభవన్‌లో కేటీఆర్‌నికలిసి సీఎం సహయనిధి కి రూ 50 లక్షల చెక్ ను అందచేశారు. ఇప్పటికే బాలకృష్ణ సినీ కార్మికుల సంక్షేమం కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) కి రూ 25 లక్షల చెక్ ను సి కళ్యాణ్ కు అందించారు.