పవన్ కళ్యాణ్‌ త్వరగా కొలుకోవాలిః కత్తి మహేశ్

274
Kathi Mahesh Pawan Kalyan
- Advertisement -

ప్రముఖ సిని  క్రిటిక్ కత్తి మహేశ్ మరో సారి వార్తల్లో నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించడం ద్వారా కత్తి మహేశ్ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ కత్తి మహేశ్ మధ్య గొడవ తీవ్ర స్ధాయికి చేరడంతో ఆయన్ను ఆరునెలలు రాష్ట్ర బహిష్కరణ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా ఆయన మరోసారి పవన్ కళ్యాణ్ ను విమర్శలు చేశారు. హైదరాబాద్‌ లో ఆంధ్రావాళ్లను కొడుతున్నారని ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలపై కత్తి మహేశ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక స్ధితిని తెలియజేస్తున్నాయన్నారు. ఆయన త్వరలో మంచి సైక్రియాటిస్టుకు చూపించుకోవాలని.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు కత్తి మహేశ్.

తెలంగాణ ప్రభుత్వం తనను నగర బహిష్కరణ విధించినా..తెలంగాణ ప్రజలు మాత్రం ఏనాడూ పల్లెత్తు మాట అనలేదని కత్తి మహేశ్ గుర్తు చేశారు. రాజకీయం కోసం ప్రజల మనసుల్లో విద్వేషం నింపొద్దని హితవు పలికారు. ఇదే సమయంలో ఆయన పవన్‌కు పరిటాల రవి గుండుకొట్టించారన్న అంశాన్ని ప్రస్తావించారు.

ఇటీవల పవన్ ప్రతి సభలోనూ రాయలసీమ గూండాలు అంటూ మాట్లాడటంపై కత్తి మహేశ్ అభ్యంతరం తెలిపారు. త్రివిక్రమ్ చెప్పిన కథలు వినిచెడిపోవద్దని రాయలసీమ వాసులు చాలా ప్రశాంతత చిత్తం కలిగిన వారని కత్తి మహేశ్ అన్నారు. గుండుకొట్టించినంత మాత్రాన రాయలసీమ వాసులందరినీ రౌడీలు అంటారా అని ప్రశ్నించారు. తానూ రాయలసీమ బిడ్డనే అని కత్తి మహేశ్ గుర్తు చేశారు.ఇక కత్తి మహేశ్ పవన్ కళ్యాణ్‌ పై చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -