ఓంపురి మృతికి ‘మా’ సంతాపం

213
Cinema Has Lost a Brilliant Artist
- Advertisement -

విల‌క్ష‌ణ‌ నటనకు కేరాఫ్ ఓంపురి. న‌టుడిగా ద‌శాబ్ధాల చ‌రిత్ర‌ ఆయ‌న సొంతం. ఎన్నో వైవ‌ధ్య‌మైన పాత్ర‌లకు జీవం పోసిన ఆయ‌న తిరిగిరాని అనంత‌లోకాల‌కు ప‌య‌న‌మయ్యారు. 66 ఏళ్ల ఓంపురి నేటి ఉద‌యం గుండెపోటుతో స్వగృహంలో మృతి చెందారు. ఈ మరణంతో బాలీవుడ్‌ విషాదంలో మునిగిపోయింది.

ఓంపురి హర్యానా- అంబాలా ప్రాంతంలో పంజాబీ కుటుంబంలో 18 అక్టోబర్‌, 1950లో జన్మించారు. పుణె- ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ ఇండియాలో సినిమా విద్య‌ను అభ్య‌సించారు. 1976లో మరాఠీ చిత్రం `ఘాశీరామ్‌ కొత్వాల్‌`తో వెండితెర ఆరంగేట్రం చేశారు. 1982లో `అరోహణ్‌`, 1984లో `అర్ధ్‌ సత్య` చిత్రాలకుగాను ఆయన జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి `పద్మశ్రీ` పురస్కారం కీర్తి కిరీటంలో చేరింది.

ఓంపురి తెలుగులో `అంకురం` చిత్రంలో నటించారు. ఈ గ్రేట్ యాక్ట‌ర్‌ మరణంపై టాలీవుడ్ నుంచి మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేసింది. ఈ సంద‌ర్భంగా `మా` అసోసియేష‌న్ అధ్య‌క్షుడు డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌ మాట్లాడుతూ -“ ప్రతిభా పాటవాలు, సృజనాత్మకత, నిజాయితీ, నిబద్ధత కలిగి దృఢ సంకల్పంతో నిరంతర న‌ట‌యోధుడిగా విజ‌య‌వంత‌మైన ప‌య‌నం సాగించారు ఓంపురి. ఆయ‌న లేని లోటు తీర్చ‌లేనిది. తెలుగు నటీన‌టులంద‌రి త‌ర‌పున నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాం“ అన్నారు. భార‌తీయ సినీప‌రిశ్ర‌మ ఓ గొప్ప న‌టుడిని కోల్పోయిందని `మా` ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివాజీరాజా అన్నారు.

- Advertisement -