రాననుకున్నారా.. రాలేననుకున్నారా..

93
chiru

9ఏళ్లు వెండితెరకు దూరమైన చిరంజీవి మానియా ఏమాత్రం తగ్గలేదు. ఆ విషయం శనివారం గుంటురులో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకను చూస్తే ప్రతి ఒక్కరికి అర్దం అవుతుంది. ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ కు మెగా అభిమానులు వేలల్లో తరలివచ్చారు. ఐలాండ్ గ్రౌండ్‌ మొత్తం అభిమానులతో కోలాహలంగా మారింది. మెగాస్టార్ కు మళ్లీ వెల్‌కమ్ చెప్పేందుకు మెగా ఫ్యాన్స్ వెల్లువల తరలివచ్చారు. దాసరిగారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ వేడుకలో చిరు మాట్లాడుతూ.. ‘‘సరిపోవడం లేదు. ఈలలు.. చప్పట్లు విని చాలా సంవత్సరాలు అయింది. వీటికి ఎంత శక్తి ఉన్నది అనుభవపూర్వకంగా తెలిసిన వాడిని. మీ నుంచి మరింత ఉత్సాహం కావాలి. దాని కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూసి ఇప్పుడు మీ ముందుకు వచ్చానన్నారు.

‘బాస్‌ కమ్‌ బ్యాక్‌’ అంటూ పెద్ద ఎత్తున మీరు పిలుస్తుంటే ఆనందంగా ఉంది. మీతో పాటు ఆత్మీయత, అభినందనలు పంచుకోవడానికి వచ్చిన ముఖ్య అతిథి దాసరి నారాయణరావుగారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో ఖైదీ డ్రస్‌తో ఉన్న నా ఫస్ట్‌లుక్‌ వచ్చినప్పుడు జేబుపై ఉన్న 150 నంబర్‌ చూసి దాసరి నాకు ఫోన్‌ చేశారు. సినిమాకు ‘ఖైదీ నంబర్‌ 150’ పెట్టుకోవాలని సూచించారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పది సంవత్సరాలు 10 క్షణాల్లా గడిచిపోయాయి. ఆ సమయం తెలియకుండా జరగడానికి లోపల నన్ను నడిపించిన శక్తి ఏమిటి? అని నాలో ఓ ప్రశ్న ఉదయించింది. పది సంవత్సరాల తర్వాత కూడా 25 సంవత్సరాల ముందున్న వూపు, ఉత్సాహం నాలో నింపిన ఆ శక్తి ఏమిటి? ఈ పది సంవత్సరాల వ్యవధిలో నన్ను మీ గుండెలకు అతి దగ్గరగా ఉంచుకుని అక్కున చేర్చుకుని ఇంత ప్రేమ చూపిన ఆ శక్తి పేరు.. ఆ అభిమానం పేరు.. నా తమ్ముళ్లు.. సోదరులు.. వారు చూపిన ఆత్మీయత, అన్నారు.

‘‘నేను మళ్లీ సినిమా చేయాలనుకున్నప్పుడు కొన్ని కథలు విన్నాను. అప్పుడు షడ్రుచోపేతమైన భోజనం అందించేలా కనిపించిన చిత్రం ‘కత్తి’. ఇందులో కామెడీ, యాక్షన్‌, లవ్‌, అంతకుమించి సందేశం ఉంది. ఈ కథ మీరు చేస్తానంటే దగ్గరుండి రైట్స్‌ ఇప్పిస్తానని తమిళ నటుడు విజయ్‌ అన్నారు. ఆయనకు ధన్యవాదాలు. ఈ సినిమా అనగానే నాకు వెంటనే వి.వి.వినాయక్‌ మాత్రమే గుర్తొచ్చారు. వినాయక్‌ను ఎంచుకోవడమే మాకు తొలి విజయం. నిజంగా చరణ్‌ చెప్పినట్లు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. చరణ్‌ ‘ధృవ’ సినిమా చేస్తూనే ఎక్కడా వృథా అనేది లేకుండా నిర్మాణ బాధ్యతలు చేపట్టినందుకు ఎన్ని ధన్యవాదాలు తెలిపినా తక్కువే అన్నారు.

. మిమల్ని చూస్తుంటే ‘ఇంద్ర’ సినిమాలో ఓ డైలాగ్‌ గుర్తొస్తోంది. ‘‘రాననుకున్నారా? రాలేననుకున్నారా? దిల్లీకి పోయాడు. డ్యాన్స్‌లకు దూరమైపోయాడు. హస్తినాపురానికి పోయాడు హాస్యానికి దూరమైపోయాడు.. ఈ మధ్య కాలంలో మా మధ్యన లేడు.. అందుకు మాస్‌కు దూరమైపోయాడు.. అనుకున్నారా? అదే మాస్‌.. అదే గ్రేస్‌.. అదే హోరు.. అదే జోరు. అదే హుషారు. మిమ్మల్ని రంజిపచేయడానికి నన్ను చక్కగా చూపిన అందరికీ ధన్యవాదాలు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన ఒక్కోసాంగ్‌ ఆణిముత్యంలా శ్రోతల్లోకి వెళ్లిపోయింది. మీతో కేరంతలు కొట్టేలా సాంగ్‌ చేయడం నాకు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రతీ టెక్నిషియన్‌ నన్ను కొత్తగా చూపించడానికి ప్రయత్నించారు. రామ్‌చరణ్‌ సమర్థ నిర్మాతగా అవతారం ఎత్తుతాడని వూహించలేదు. చరణ్‌కు నటుడిగా హద్దులూ తెలుసు.. నిర్మాతగా పద్దులూ తెలుసు. భవిష్యత్‌లో మంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా స్థిరపడతాడని ఆశిస్తున్నాను’’

Khaidi No 150 Official Theatrical Trailer || Mega Star Chiranjeevi || V V Vinayak || DSP