క్రిస్మస్ కానుకగా ప్రభాస్ ఎపిసోడ్

439
- Advertisement -

నటసింహం బాలయ్య బాబు ‘అన్‌ స్టాపబుల్ 2’ టాక్ షోలో రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చాడు. నిన్న ఈ ఎపిసోడ్ కి సంబధించిన షూట్ జరిగింది. ప్రస్తుతం ఈ షూటింగ్ పిక్స్ వైరల్ గా మారాయి. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. సాధారణంగా ప్రభాస్ రిజర్వ్డ్‌గా ఉంటారు. ఎక్కువగా షోస్, ఈవెంట్స్ వంటి వాటికి అటెండ్ కారు. మరీ ప్రభాస్ తో బాలయ్య మధ్య కెమిస్ట్రీ అండ్ ముచ్చట్లు ఎలా ఉంటాయో చూడాలి. సహజంగా ఇద్దరు సెలబ్రిటీల మధ్య ఇంటర్వ్యూలలో జరిగే సంభాషణంతా డిప్లోమాటిక్ సాగుతూ ఉంటుంది.

ప్రశ్నల నుండి ఆన్సర్స్ వరకు అంతా పాలిష్డ్ గా ఉంటాయి. మరి ఇలాంటి టాక్ షోలతో పెద్దగా కిక్కేముంటుంది. కానీ బాలయ్య షో అలా కాదు. రా మెటీరియల్ బయటకు తీసి, నిజాలు జనాల ముందు మాట్లాడుకుంటూ ఫ్యాన్స్ కు ఫుల్ మజాను పంచుతున్నారు బాలయ్య. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ టాక్ షో, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ గెస్ట్స్ తో బాలయ్య సరదా సంభాషణలు, ఏళ్లుగా ప్రచారమవుతున్న వివాదాలకు సమాధానాలు ఇస్తూ ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నారు.

మొత్తమ్మీద బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో సూపర్ సక్సెస్. హోస్ట్ గా మారాలనుకుంటున్న, ఆల్రెడీ మారిన స్టార్స్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు బాలయ్య. ఇక తాజాగా బాలయ్య ‘అన్‌స్టాబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ సీజన్‌-2లో ప్రభాస్ – గోపీచంద్ ఎపిసోడ్ ను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ ఎపిసోడ్ ఏ రేంజ్ లో పేలుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

హ్యపీ బర్త్‌డే తలైవా…

విజయ్ దేవరకొండకి బండ్ల పంచ్

వీరసింహారెడ్డి..సెకండ్ సింగిల్

- Advertisement -