వివాహితను అత్యాచారం చేసిన ఐదుగురు పాస్టర్లు..

373
Christian Priests Use ‘Secret Confession’ to Blackmail, Rape Housewife
- Advertisement -

చేసిన తప్పును ప్రభువుతో చెప్పమని.. అనుసంధాన కర్త అయిన చర్చి ఫాదర్ తో చెప్పుకుంటారు. మరి అలాంటి చర్చి ఫాదర్లే కామాందులుగా మారితే ఎవరితో చెప్పుకోవాలి. అలాంటి సంఘటనే కేరళలో జరిగింది. పెళ్లికి ముందు ఆమె చేసిన తప్పును జీసస్ తో చెప్పి పాప విముక్తిని పొందాలని వచ్చిన ఓ వివాహితపై చర్చి ఫాదర్లే కామంతో కాటు వేశారు. మలంకర ఆర్థోడాక్స్ చర్చి ఫాదర్ తో పెళ్లికి ముందు ఆమె చేసిన తప్పు, పెళ్లి తర్వాత పదే పదే.. మనసును బాధ పెట్టడంతో పశ్చాతాపంతో కుమిలిపోయింది.

Christian Priests Use ‘Secret Confession’ to Blackmail, Rape Housewife

ఈ నేపథ్యంలో తనకు పాప విముక్తి కలిగించండి అంటూ మరో ఫాదర్ తో తాను చేసిన తప్పును చెప్పుకుంది. ధైర్యం చెప్పాల్సిన చర్చి ఫాదర్, ఆమె బలహీనతను ఆసరాగా తీసుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆమె వీడియోలు, ఫోటోలు వేరే చర్చి ఫాదర్లు పంపించాడు. ఆ ఫోటోలు, వీడియోలను చూపించి మిగతా చర్చి ఫాదర్లు సైతం ఆమెపై అత్యాచారం చేశారు. ఇంత జరుగుతున్నా భర్తకు చెప్పకుండా తనలో తానే కుమిలిపోయింది.

అయితే గత ఫిబ్రవరిలో భార్య మెయిల్ కి ఓ హోటల్ నుంచి అధిక మొత్తంలో బిల్లు రావడంతో, భార్యను నిలదీశాడు. ఆమె తనకు జరిగిన అన్యాయం గురించి భర్తకు చెప్పింది. జరిగిన విషయాన్ని చర్చి నిర్వహణ కమిటీకి ఫిర్యాదు చేయడంతో..ఆ ఫాదర్లను సస్సెండ్ చేసింది. అయితే తన భార్యపై అత్యాచారానికి పాల్పడింది మొత్తం ఎనిమిది మంది చర్చి ఫాదర్లు అంటూ భర్త ఆరోపిస్తున్నాడు.

- Advertisement -