రణబీర్‌కు చెల్లిగా రవితేజ హీరోయిన్‌..!

367
- Advertisement -

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన నేనింతే సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ శియా గౌతమ్. ఆ సినిమా హిట్టు కాకపోవడంతో అమ్మడికి అవకాశాలు ఎక్కువగా రాలేవు. ఆ తరువాత వేదం సినిమాలో ఒక పాత్రలో కనిపించినా ఆ సినిమా కూడా ఆఫర్స్ రావడానికి ఉపయోగపడలేదు. అయితే చాలా మంది పేర్లు మార్చుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని అమ్మడు అదితి శియాగా పేరు మార్చేసుకుంది. ఇక తాజాగా సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’లో సినిమాలో రణబీర్ కపూర్ చెల్లిగా నటించింది ఈ అమ్మడు .

Sanju Movie

అయితే ‘సంజూ’ సినిమాలో సంజయ్ దత్ చెల్లెలు ప్రియా దత్ క్యారెక్టర్ లో నటించిన అదితికి… చెల్లి పాత్రలో నటించడంపై మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా… రాజ్ కుమార్ హిరాణీ సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు అని చెప్పింది. రణబీర్ కు చెల్లిగా నటించినప్పటికీ… అతన్ని మాత్రం బ్రదర్ గా ఊహించుకోలేకపోయానని తెలిపింది.

Aditi Gautam

ప్రియా దత్ ను తాను ఎప్పుడూ కలవలేదని… ఆవిడ ఇంటర్వ్యూలను చూసి, ఆమె మేనరిజమ్స్ నేర్చుకున్నానని చెప్పింది. సింగిల్ టేక్ లో యాక్ట్ చేయగల గొప్ప నటుడు రణబీర్ అంటూ కితాబిచ్చింది. అతనితో పని చేసిన తర్వాత తాను అతని ఫ్యాన్ అయిపోయానని చెప్పింది.

- Advertisement -