సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఎంపీ సంతోష్ కుమార్ పేరిట చేపట్టిన అన్నదానం ప్రతి రోజు కొనసాగుతోంది.వలస కూలీల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాక గ్రామంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు.
ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పని కోసం వచ్చిన వలసకూలీలకు ఎమ్మెల్యే స్వయంగా భోజనం వడ్డించారు.సీఎం కేసీఅర్ పిలుపు మేరకు ఎంపీ సంతోష్ కుమార్ వలస కూలీల కడుపు నింపేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వలస కూలీలకు ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు 500 రూపాయల నగదు అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎంపీ సంతోష్ కుమార్ తమ నియోజకవర్గ బిడ్డ కావడం గర్వంగా ఉందన్నారు. వలస కూలీలు ఆకలితో అలమటించకుండా అన్నదానంతో తన దాతృత్వాన్ని చాటు కున్నాడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఉమా కొండయ్య, ఎంపీపీ వేణుగోపాల్, ఎమ్మార్వో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుమారు రెండు, మూడు వేల మంది వలస కార్మికుల కడుపు నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు పేద ప్రజల దీవెనలు, సీఎం కేసీఅర్ అండదండలు ఎప్పుడు ఉంటాయని పేర్కోన్నారు.