తంగలాన్ : చియాన్‌కు గాయాలు..!

57
- Advertisement -

చియాన్ విక్రమ్‌కు షూటింగ్ సమయంలో గాయపడ్డారు. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగాలాన్ సినిమా రిహర్సల్ షూటింగ్ సమయంలో ఘటన చోటుచేసుకుంది. ఓ యాక్షన్ సీన్‌ రిహార్సల్స్‌లో భాగంగా విక్రమ్ గాయపడ్డట్లు సినిమా యూనిట్ పేర్కొంది. ఈ గాయం కారణంగా విక్రమ్‌కు పక్కటెముక విరిగినట్టు తెలిపారు. పంతొమ్మిదవ శాతబ్ధంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ నేపథ్యంలో తంగలాన్ తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు మేకింగ్ వీడియోలు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.

Also Read: Nargis Dutt:జీవిత చరిత్ర

ముఖ్యంగా ఈ సినిమాలో విక్రమ్‌ గెటప్‌ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఈ సినిమా కోసం విక్రమ్‌ తన దేహాన్నిపూర్తిగా మార్చుకున్నాడు. స్టైలిష్‌కు బ్రాండ్‌లా కనిపించే విక్రమ్‌ డీ గ్లామరైజ్‌ పాత్రలో కనిపించనున్నట్టు విక్రమ్‌ విడుదలైన పోస్టర్లను చూస్తే అర్థమవుతుంది. ఇక ఇప్పటికే 80శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మరో రెండు షెడ్యూల్‌ ఉండగా ఇలాంటి దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది.

Also Read: ఉఫ్.. కేజీఎఫ్ తీస్తా అన్నాడట

- Advertisement -