ప్రభాస్ వెనుక అంత కథ నడిచిందా ?

32
- Advertisement -

ప్రభాస్ కి చాలా మంచివాడు అని పేరు ఉంది. మన అనుకుంటే ఎక్కువగా మొహమాట పడతాడు. వారు వచ్చి ఏదైనా సాయం అడిగితే నో చెప్పలేడు. ఈ క్రమంలోనే మారుతి డైరెక్షన్‌ లో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ప్రభాస్ లాంటి నేషనల్ స్టార్ ని, లోకల్ దర్శకుడు మారుతి ఎలా హ్యాండిల్ చేస్తాడు ? ఇదే ప్రభాస్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతుంది. అసలు ఈ సినిమా వెనుక చాలా కథే నడిచిందట. కేవలం డబ్బులు పంచుకోవడమే లక్ష్యంగా ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది అని టాక్ నడుస్తోంది.

ప్రభాస్ కాల్షీట్లను సొమ్ము చేసుకునేందుకు అందరూ చేతులు కలిపారట. ఈ మొత్తం డీల్ సెట్ చేసేందుకు ఇద్దరు కీలక వ్యక్తులు తెరవెనక పావులు కదిపారట. అలా వాళ్లకు కూడా భారీగానే ముట్టిందని తెలుస్తోంది. ఈ సినిమా కంటెంట్ ఏంటనేది ప్రభాస్ కూడా పెద్దగా పట్టించుకోలేదు అంటున్నారు. తక్కువ కాల్షీట్లకు ఎక్కువ మొత్తం వస్తుందనే ఒకే ఒక్క లైన్ మీద ప్రభాస్ ఈ సినిమాకు ఓకే చెప్పాడని అంటున్నారు. అందుకే, ప్రభాస్ ఆల్రెడీ చేస్తున్న సినిమా షూట్ ను కూడా పోస్ట్ ఫోన్ చేసి.. మారుతి సినిమాకి డేట్స్ ఎడ్జెస్ట్ చేశాడు.

Also Read: ఉఫ్.. కేజీఎఫ్ తీస్తా అన్నాడట

మరీ అందరూ ఇలా డబ్బును దృష్టిలో పెట్టుకునే సినిమా చేస్తే.. ఇక సినిమా అవుట్ ఫుట్ ఎలా వస్తుందో..! కనీసం మారుతి అయినా డబ్బు మైండ్ సెట్ తో వర్క్ చేయకుండా.. తన భవిష్యత్తు అని వర్క్ చేస్తే.. మంచిది. ఏది ఏమైనా ఇటు ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమా రికార్డులు తిరగరాస్తుందని, తమ హీరో పాన్ ఇండియా హీరోగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడని ఆశ పడుతున్నారు.

Also Read: తంగలాన్ : చియాన్‌కు గాయాలు..!

- Advertisement -