టాలీవుడ్ మెగా హీరో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘చిత్రలహరి’.కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 12న విడుదల కాబోతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే ‘పరుగు పరుగు’అనే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం ఆదివారం ‘గ్లాస్ మేట్స్’అనే మరో లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది. ‘కమాన్ బాయ్స్.. అంటూ మొదలైయ్యే ఈ పాట గ్లాస్ మేట్స్ గొప్పతనం గురించి చెప్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. నెటిజన్లను అరిస్తున్న ఈ పాటను చంద్రబోస్ రాశారు. రాహుల్ సిప్లిగుంజ్, పెంచల్ దాస్ పాడగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకుర్చారు. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ మెగా హీరో సరసన కళ్యాణి ప్రియదర్శని, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు.