మెగా హీరో, సుప్రిమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా చిత్రలహరి . నేను శైలజ మూవీ దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శిని, నివేదా హేతురాజ్ లు హీరోయిన్ గా నటిస్తున్నాండగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
జనవరి 24న గ్లాస్ మేట్స్ సాంగ్‌ను ఖమ్మంలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ని విడుదల చేసిన నిర్మాతలు జనసేన సింబల్ గాజు గ్లాస్‌ను చూస్తూ తేజు కన్ను కొట్టే పోస్టర్ని అద్భుతంగా డిజైన్ చేశారు. ఓ వైపు ఎన్నికల ప్రచారం హోరెత్తుతుండగా తేజు పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పటికే పవన్ స్ధాపించిన జనసేనకు మెగా హీరోలు రామ్ చరణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగబాబు, బన్నీ, శిరీష్ జైకొట్టగా మెగాడాటర్ నిహారిక సైతం ప్రచారానికి సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తేజు ఏకంగా గ్లాస్ సింబల్ చూపిస్తూ పోస్టర్ని విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ‘చిత్రలహరి’ అనే ఓ ‘బార్’ చుట్టూ సినిమా కథ తిరుగుతుండటంతో ఈ సినిమాకి ఈ టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.