హైదరాబాద్ తిరిగొచ్చిన చిరు

31
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రెండు పాటల చిత్రీకరణ యూరప్‌లో పూర్తయింది. రెండు రోజుల ముందే షూటింగ్ పూర్తి చేశారు. కానీ కుటుంబంతో కొంత సమయం గడిపి చిరు యూనిట్ కంటే కాస్త ఆలస్యంగా వచ్చారు. అక్కడ షెడ్యూల్ ముగించుకుని చిరంజీవి నిన్న ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.

చిరంజీవి పోర్షన్ పూర్తయింది. కొన్ని ప్యాచ్‌వర్క్‌లు మినహా టోటల్ షూటింగ్ కంప్లీట్ అయింది. వాల్తేర్ వీరయ్య జనవరి 13, 2023న సంక్రాంతి స్పెషల్‌గా విడుదలవుతోంది. ఈ సినిమా సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహా రెడ్డి, విజయ్ వారసుడు సినిమాలతో క్లాష్ కానుంది.

ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాబీ స్వయంగా కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే రాశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -