మహేశ్‌తో మూవీ చేయాలనుంది: చిరు

393
chiru
- Advertisement -

సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తుండగా కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది.

ఇక ఈ సినిమాలో మహేశ్ నటిస్తారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి…ఆ వార్తలను కొట్టిపారేశారు. మహేశ్‌ తనకు కొడుకులాంటి వాడని..అతడితో కలిసి సినిమా చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. ఆచార్యలో మహేశ్ నటిస్తున్నారన్న వార్త ఎలా బయటకు వచ్చిందో అర్ధం కావడం లేదన్నారు.

అయితే ఈ మూవీలో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని కొరటాల అనుకుంటున్నారని కానీ ప్రస్తుతం చెర్రీ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో డేట్స్ ఇవ్వడం కష్టంగా మారిందని తెలిపారు చిరు.

- Advertisement -