గ్రేటర్‌లో కేటీఆర్ పర్యటన…

169
ktr

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు మంత్రి కేటీఆర్.అమీర్ పేటలో అన్నపూర్ణ భోజనం,పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లో జరుగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.

అమీర్‌పేటలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ భోజనం సెంటర్‌ని పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఉచితంగా భోజనాన్ని అందిస్తుండగా సోషల్ డిస్టెన్స్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. అన్నపూర్ణ కేంద్రంలో అందుతున్న సేవలను గురించి అక్కడున్నవారిని అడిగి తెలుసుకున్నారు కేటీఆర్.

అనంతరం నాగార్జున సర్కిల్‌లో జరుగుతున్న స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. శ్మశానవాటిక వద్ద ట్రాఫిక్‌ సవ్యంగా సాగేందుకు రూ. 23 కోట్ల వ్యయంతో చేపట్టిన రెండు లైన్ల ర్యాంప్‌ పనులను పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి పరిశీలించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్య ఉన్న చోట పనుల్లో వేగం పెంచాలని, మే 15 నాటికి పనులను పూర్తి చేయాలని ఆయన సూచించారు.