- Advertisement -
దుండగుడి దాడిలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై లీలావతి ఆసుపత్రికి సారా అలీఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ చేరుకున్నారు. తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ ను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించింది సారా, ఇబ్రహీం. మరోవైపు బాంద్రాలోని తమ నివాసంలో దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు కరీనా కపూర్.
సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి పై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ దాడి వార్తతో తీవ్ర కలత చెందానని… సైఫ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నట్లు ‘X’లో మెగాస్టార్ పోస్ట్ చేశారు.
సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన మీద స్పందించారు జూ.ఎన్టీఆర్ . ఈ ఘటన తెలియగాని షాక్ అయ్యానని ‘X’ లో తారక్ పోస్ట్ పెట్టారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు జూ.ఎన్టీఆర్.
Also Read:సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు..
- Advertisement -