అన్నను చూసి నేను భక్తుడినయ్యా: పవన్

168
chiru

అన్నయ్య చిరంజీవిని చూసే తనకు దేవుడిపై నమ్మకం కలిగిందన్నారు జనసేన అధినేత,మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్. హనుమంతుడినినపై భక్తి అన్న ద్వారానే వచ్చిందని..నాస్తికుడు, కమ్యూనిస్టు నుంచి రాముని పూజించే వ‌ర‌కు మా నాన్న వచ్చారని చెప్పారు.

మా నాన్న నుంచి అన్నకు….అన్న ద్వారా నాకు భక్తిఅబ్బిందని….చిన్నప్పుడు ఎన్నోసార్లు హనుమాన్ చాలీసా చదివానని తెలిపారు పవన్‌.

మెగాస్టార్ చిరంజీవి ఏప్రిల్ 8కి, త‌న‌కి ఓ అనుబంధం ఉంద‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. హ‌నుమాన్ జ‌యంతి సందర్భంగా తన చిన్ననాటి సంఘటనను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే దేవుడిపై తనకు నమ్మకం పెరగడానికి గల కారణాలను చెప్పుకొచ్చారు పవన్.