అల్లు అర్జున్ ‘పుష్ప’ కొత్త రికార్డు..

309
bunny

ఈ యేడాది అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈమూవీకి పుష్ఫ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ నేపథ్యంలో నిన్న బన్నీ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. మొరటువాడైన కుర్రాడిగా బన్నీ లుక్ కొత్తగా వుంది. ఆయన అభిమానులను ఈ లుక్ ఆకట్టుకుంది. లాక్ డౌన్ ఎత్తేయగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

puspha

కాగా ట్విట్టర్‌లో అత్యధిక లైక్స్ ను సాధించిన ఫస్టులుక్ పోస్టర్‌గా ‘పుష్ప’ కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవల కాలంలో తెలుగులో ట్విట్టర్ ద్వారా వదిలిన ఫస్టులుక్ పోస్టర్స్ లో చాలా వేగంగా అత్యధిక లైక్స్ ను దక్కించుకున్న ఫస్టులుక్ పోస్టర్ గా ‘పుష్ప’ నిలిచింది. ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణ చేసే ముఠా సభ్యుడిగా ఈ సినిమాలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా రష్మిక అలరించనుంది. ఈ సినిమాను సుకుమార్ ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు.