అనీష్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది!

3
- Advertisement -

కింగ్ నాగార్జున సమర్పణలో వచ్చిన లేటెస్ట్ హార్ట్‌బస్టర్ ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. దర్శకుడు వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం థాంక్ యూ మీట్ నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

థాంక్ యూ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇక్కడి వాతావరణం చూస్తుంటే నిజమైన సక్సెస్ అంటే ఏంటో మీ ఉత్సాహంలోనే తెలుస్తోంది. ఈ ఎనర్జీ చూస్తుంటేనే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అర్థమవుతోంది. హీరో అనీష్ చాలా అదృష్టవంతుడు. ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది హీరోలు ఒక డెబ్యూ హీరోకు ఈ స్థాయిలో సపోర్ట్ చేయడం చాలా అరుదు. అది ఒక్క అనీష్‌కే దక్కింది. ఈ సినిమాలోని ఒక సాంగ్‌ను నాని రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను తారక్ రిలీజ్ చేశారు. కింగ్ నాగార్జున గారు ఈ సినిమాకు వెన్నుముకలా నిలిచారు. రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చారు. ఇప్పుడు నేను ఈ వేడుకకు వచ్చాను. అంతేకాదు, ఈ సినిమా ప్రీమియర్స్‌కు వెంకటేష్ గారితో పాటు ఎంతోమంది వచ్చి అనీష్‌ను అభినందించారు. ఇంతమంది ఈ సినిమాను ఎందుకు ప్రేమిస్తున్నారు? ఇంతగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అనే ఆలోచన మీకు రావచ్చు. దానికి కారణం నా మిత్రుడు మహేష్ రెడ్డి. ఆయన చేసుకున్న పుణ్యం, బాబాపై ఆయనకున్న భక్తి, సినిమా మీద ఆయనకున్న ప్రేమ, అభిమానం ఇవన్నీ ఈ సినిమాకు ఇంతటి సపోర్ట్ రావడానికి కారణమయ్యాయి. వ్యాపారంలో ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ సినిమాపై ఆయనకున్న ప్రేమ, భక్తిభావం ప్రత్యేకమైనవి. నాగార్జున గారితో ఆయనకు ఉన్న అనుబంధం, గతంలో కలిసి చేసిన సినిమాల వల్ల ఈ సినిమా పట్ల కూడా ఆయనకు ప్రత్యేకమైన మక్కువ ఏర్పడింది. వాళ్ల అబ్బాయికి కూడా సినిమాలపై ఆసక్తి కలగడం, నటన వైపు రావడం, తల్లిదండ్రులు అతన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇంత అద్భుతమైన టాలెంట్, ఆసక్తి ఉన్న అనీష్ ను మనం కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ అతని వెనుక నిలబడ్డారు.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. “మీ హుషారు, ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి ఇప్పటికే పలుమార్లు మాట్లాడాను. ఈ సినిమాను నేను ప్రజెంట్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. అనీష్ విషయంలో చాలా గర్వంగా ఉంది. అలాగే అనస్వర, మహేష్‌తో పాటు ప్రతి ఒక్కరికీ కంగ్రాట్యులేషన్స్. ఈ వేడుకలో అనీష్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ పిలిచి థాంక్స్ చెప్పడం నాకు చాలా నచ్చింది. తెలుగు సినిమా ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కొత్త టాలెంట్‌ను, కొత్తదనాన్ని వాళ్లు ఎంతో ఎంకరేజ్ చేస్తారు. చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ నన్ను అన్నా అని పిలుస్తాడు. మా అబ్బాయి అఖిల్ ఏమో చిరంజీవి గారిని పెదనాన్న అంటాడు. మరి ఆయన్ని నేను ఏమని పిలవాలో అర్థం కావడం లేదు (నవ్వుతూ). సో.. ఈరోజు బాస్ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. రామ్ చరణ్ నన్ను అన్నా అంటాడు కాబట్టి, నేను కూడా చిరంజీవి గారిని అన్నా అని పిలుస్తాను. చిరంజీవి గారు ఈ వేడుకకు వచ్చి టీంను బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది.

Also Read:కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?: కేటీఆర్

- Advertisement -