గ్యాంగ్ లీడర్ మళ్లీ వస్తున్నాడు!

31
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో ఒకటి గ్యాంగ్ లీడర్. చిరుకు మరింత మాస్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్‌ ఇప్పటికి ఫ్యాన్స్‌ని ఉర్రూతలుగిస్తాయి. అయితే తాజాగా మళ్లీ విడుదలకు సిద్ధమైంది గ్యాంగ్ లీడర్‌.

దీంతో మరోసారి వింటేజ్ చిరంజీవిని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు బప్పీ లహరి సంగీతం అందించగా మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతిలు జంటగా సత్యనారాయణ, శరత్ కుమార్, మురళీమోహన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. విజయ్ బాపినీడు డైరెక్ట్ చేసిన ఈ సెన్సేషనల్ మూవీని ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మరి గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచిచూడాలి..

ఇక ప్రస్తుతం చిరు నటించిన భోళాశంకర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుండగా త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్‌ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -