పవన్‌తో ఠాగూర్‌..ఎన్టీఆర్‌తో గ్యాంగ్‌లీడర్‌: చిరంజీవి

165
samantha
- Advertisement -

ఆరుపదుల వయస్సులోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యతో పాటు వేదాళం,లూసిఫర్ రీమేక్‌ చిత్రాల్లో నటిస్తున్నారు చిరు.

అయితే రీసెంట్‌గా అక్కినేని వారి కోడలు సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్‌ షోకు అతిథిగా విచ్చేసిన చిరు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మీరు చేసిన సూపర్ హిట్ సినిమాలను ఏ హీరోలు రీమేక్ చేస్తే బాగుటుందని అడగగా ఠాగూర్ సినిమా పవన్ కల్యాణ్‌కి బాగుంటుందన్నారు. ఇంద్ర సినిమాకు ప్రభాస్ సూట్ అవుతాడని , ఛాలెంజ్ సినిమాకు బన్నీ లేదా విజయ్ దేవరకొండ అయితే ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంటార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

జగదీకవీరుడు.. అతిలోకసుందరి సినిమాని ‌రామ్‌చరణ్ లేదా మహేష్ బాబు చేస్తే బాగుంటుంది. ఇందులో అతిలోక సుంద‌రిగా స‌మంత మాత్ర‌మే క‌నిపించాలన్నారు. గ్యాంగ్ లీడ‌ర్ మాత్రం చ‌ర‌ణ్ లేదా ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని తెలిపారు చిరు.

- Advertisement -