ఐనవోలు జాతరకు ఏర్పాట్లు పూర్తి!

47
ainavolu jatara

ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు జాతర తేదీలు ఖరారయ్యాయి. జ‌న‌వ‌రి 13 నుంచి 15వ తేదీ వ‌ర‌కు జాతరను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జాత‌ర‌కు అశేషంగా త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌గు జాగ్ర‌త్త‌ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌త‌, లావెట్రీలు, చ‌లువ పందిళ్ళు, మంచినీటి వ‌స‌తి, స్నానాల గ‌దులు, బ‌ట్ట‌లు మార్చుకునే గ‌దులు, మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక వ‌స‌తులు, క్యూ లైన్లు, విద్యుత్, సిసి కెమెరాలు, భ‌క్తుల‌కు అన్న‌దానం వంటి అనేక వ‌స‌తుల క‌ల్ప‌న పై ఆయాశాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు.

రూ. కోటితో ఐనవోలులో శాశ్వత ప్రాతిపదికన బాత్ రూంల నిర్మాణానికి ముందుకు వచ్చిన కుడాని, చైర్మన్ మర్రి యాదవ రెడ్డిని మంత్రి అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్ తోపాటు, డిసిసిబి చైర్మ‌న్ మార్నేని ర‌వింద‌ర్ రావు, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, స్థానిక ప్రజాప్ర‌తినిధులు, వివిధ శాఖ‌ల‌కు చెందిన అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.