కళాతపస్వికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..

320
- Advertisement -

టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత కె.విశ్వనాథ్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయన తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎన్నో మ‌రుపురాని చిత్రాలు అందించి త‌న‌కంటూ ఓ అధ్యాయం లిఖించుకున్నారు. శంక‌రాభ‌ర‌ణం చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతి ద‌శ‌దిశ‌లా వ్యాపింప‌జేశారు. ఇక ఆయన పుట్టిన ఈ సంద‌ర్భంగా రోజు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కే విశ్వ‌నాథ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ మేర‌కు ట్విట‌ర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు మెగాస్టార్‌.

గురుతుల్యులు, కళాతపస్వి కే. విశ్వనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్ చేశారు. తెలుగుజాతి,తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసి, తెలుగు సినిమా చరిత్ర శంకరాభరణం ముందు,శంకరాభరణం తర్వాత, అనేలా చేసిన మీరు తెలుగు వారందరికీ అందిన వరం! మీ చిత్రాలు అజరామరం! మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం.. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ తో కలిసి ఉన్న ఫొటోను చిరు షేర్ చేశారు.

- Advertisement -