ప్రభాస్‌పై బిగ్‌బీ ప్రశంసలు..

104
- Advertisement -

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి అశ్వినీదత్‌ ప్యాన్‌ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే అమితాబ్ ఈ షూట్‌లో పాల్గొన్నారు. ప్రభాస్‌,బిగ్‌బీలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. అయితే ఈ విషయాన్ని అమితాబ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

‘‘బాహుబలి’ ప్రభాస్‌తో తొలి సినిమా.. మొదటి రోజు.. మొదటి షాట్‌ షూట్‌ జరిగింది. అతని ఆరా.. టాలెంట్‌ చూసి నేర్చుకోవడానికి చాలా ఉందని గ్రహించా’’ అని ట్వీట్‌ చేశారు. వరల్డ్‌లో వన్‌ ఆఫ్‌ దీ లెజెండ్రీ యాక్టర్‌ బిగ్‌బీ పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ను ఇలా ప్రశంసించడం విశేషం. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తోంది.

- Advertisement -