బతుకమ్మకు స్వాగతం..

202
chiru
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ సంబరాల్లో భాగంగా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఇక బతుకమ్మ సంబరాలు మొదలైన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఆడపడుచు ‘బతుకమ్మ’ కు స్వాగతం అంటూ విష్ చేశారు.

ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ‘ బతుకమ్మ’ కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం.ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

- Advertisement -