బీసీ కమిషన్ చైర్మన్‌ను సన్మానించిన మంత్రి గంగుల

49
gangula

ఇటీవల రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించి స్వస్థలం హుజురాబాద్ లో ఉన్న డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు ను మంత్రి గంగుల కమలాకర్ బుధవారం నాడు కలిశారు.పట్టణంలోని వకుళాభరణం స్వగృహంలో మర్యాదపూర్వకంగా మంత్రి కలిసి అభినందించారు. ఈ సందర్భంగా శాలువా, పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు.

డా వకుళాభరణం ను సీఎం కేసీఆర్ చైర్మన్గా నియామకం చేయడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సరైన వ్యక్తికి ,సముచితమైన గౌరవం దక్కిందన్నారు .తాను నిర్వహించే బిసి సంక్షేమ శాఖలో భాగంగా బీసీ కమిషన్ చైర్మన్ గా డాక్టర్ వకుళాభరణం దక్కిన అరుదైన గౌరవం అని అని ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు

రానున్న రోజులలో సమన్వయంతో కలిసి పని చేస్తామన్నారు సీఎం కంటున్న కలల సాకారం దిశగా బంగారు తెలంగాణ లక్ష్యంగా బీసీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి అన్నారు డాక్టర్ వకుళాభరణంను అభినందించిన వారిలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు ,హుజురాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాజీపేట శ్రీనివాస్, గందె శ్రీనివాస్ ,దొంత రమేష్ ,తాళ్లపల్లి రమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, కిషన్, ముత్యం రాజు, కన్నెబోయిన మహేందర్ యాదవ్, బీసీ నాయకులు కాజీపేట కృష్ణ, బండారి సదానందం, కొలిపాక సమ్మయ్య, తులసి లక్ష్మణ మూర్తి ,సందుమల్ల బాబు తదితరులు పాల్గొన్నారు.