వాల్తేరు వీరయ్య ప్రమోషన్‌లో పాల్గొంటున్న మెగాస్టార్ చిరంజీవి అనేక విషయాల పై తనదైన శైలిలో స్పందించారు. అయితే, ఈ మెగా ముచ్చట్లు కాస్త స్పైసీగా ఉండటం ఆశ్చర్య పరిచింది. ఐతే, మెగా అభిమానులను ఈ ముచ్చట్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఈ ముచ్చట్లు ఏమిటో చూద్దాం. మెగా ఫ్యామిలీలోని ముగ్గురు అన్నదమ్ములను సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారని ఎద్దేవా చేసిన మంత్రి రోజాపై చిరంజీవి స్పందించారు. వాల్తేరు వీరయ్య ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాతో స్నేహంగా ఉండి, ఇప్పుడు పెద్దల గుర్తింపు కోసం నన్ను, నా ఫ్యామిలీని తిడుతున్నారు.నన్ను తిడితేనే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది” అంటూ పరోక్షంగా రోజాకు కౌంటరిచ్చారు చిరు.
అలాగే చిరు తన పొలిటికల్ రీఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చారు. మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లబోయేది లేదని స్పష్టం చేశారు. ”నా కుటుంబంలో వ్యక్తి పార్టీ పెడితే నాకు సంబంధం ఏంటి?. నేను కూడా నేటి రాజకీయాలను, రాజకీయపరమైన విషయాలను పేపర్ చూసే తెలుసుకుంటున్నాను. రాజకీయాల్లో లేకున్నా.. కొందరు కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు” అని చిరంజీవి చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఈ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్‌లో మెగాస్టార్ చిరంజీవి తన పై విష ప్రయోగం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అది మరణ మృదంగం సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు. అప్పట్లో చిరంజీవి అభిమానులకు బాగా అందుబాటులో ఉండేవారు. అప్పుడే చిరు పై విష ప్రయోగం జరిగింది. దాని గురించి చిరు ఏం చెప్పారంటే.. ”మరణ మృదంగం సినిమా షూటింగ్‌లో ఓ అభిమాని కేట్ కట్ చేసి నా నోట్లో పెట్టబోయాడు. అయితే కేక్ తింటున్నప్పుడు కాస్త చేదుగా అనిపించడంతో.. తినడం మానేసి టెస్టులకు పంపిస్తే అందులో పాయిజన్ ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఆ అభిమానిని ఆరా తీస్తే.. తనతో నేను దగ్గరవాలని కేరళ వశీకరణ నుంచి మందు తెచ్చి కేక్‌లో కలిపినట్లు అతను చెప్పాడు” అంటూ మెగాస్టార్ చిరంజీవి అసలు విషయం చెప్పారు.
ఇవి కూడా చదవండి..