అతి తక్కువ సమయంలోనే విశేష ప్రజాదరణ పొందిన ‘ఆహా’ ఓటీటీ వేదిక వినూత్నమైన కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. ఇటీవలే ‘సామ్ జామ్’ పేరిట ఓ టాక్ షోను ప్రారభించింది. ఈ స్పెషల్ టాక్ షోకు అందాలభామ సమంత హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత ప్రముఖ వ్యక్తులను ఇంటర్వ్యూ చేయనుంది. ఇటీవల ఈ షోకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే.
తొలి ఎపిసోడ్ కు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో ఎలాగైనా టాక్ షోను గాడిలోకి తేవాలని భావించిన అల్లు అరవింద్ చిరంజీవిని రంగంలోకి దించారు. సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు హాజరు కావాల్సిన చిరు ముందే హాజరయ్యాడు. అయితే స్యామ్ జామ్‌లో షోకు రావడానికి చిరు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకున్నాడని ఫిలింనగర్ లో జోరుగా చర్చ నడుస్తోంది.
ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంను మరింత పాపులర్ చేయడంలో భాగంగానే అల్లు అరవింద్ గెస్ట్ గా చిరంజీవిని ఆహ్వానించినట్టు టాక్ నడుస్తోంది. అంతేకాదు ఆహా కోసం సినిమాలు చేయడానికి, ప్రమోట్ చేయడానికి చాలా మంది హీరోహీరోయిన్లకు భారీ మొత్తంలోనే పారితోషికం ఇస్తున్నాడట అల్లు అరవింద్. ఇక ఈ షోలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి సరికొత్త లుక్ తో ఆకర్షణీయంగా కనిపించారు.