స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిరంజీవి కథానాయకుడిగా ‘సైరా’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 35 రోజులుగా రాత్రి వేళలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నారు. బ్రిటీష్ సైన్యంతో నరసింహారెడ్డి పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ పోరాట సన్నివేశాలకు సంబంధించిన ఓ రెండు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే.. కోట ద్వారం, బ్రిటీష్ సైన్యాన్ని బట్టి నరసింహరెడ్డి బ్రిటీష్ సైన్యంతో పోరాటం చేసే సన్నివేశంగా తెలుస్తోంది. ఒక ఫోటోలో హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కనిపిస్తున్నాడు.
ఇప్పటికే సైరా నుంచి విడులైన చిరంజీవి,నయనతార, అబితాబ్ లుక్స్ సినిమాపై ఆసక్తిగా పెంచగా.. తాజాగా ఈ ఫోటోలు సినిమాపై ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్ర ట్రైలర్ ని చిరు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేయనున్నారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
చిత్ర పరిశ్రమను లీకులు పెద్ద సమస్యగా మారిపోయాయి. ఇటీవలె ఎన్టీఆర్ అరవింద సమేత నుంచి ఎన్టీఆర్, నాగబాబు ఫోటో లీక్ అవ్వగా.. తాజాగా చిరు 151వ సైరా నుంచి రెండు ఫోటోలు లీక్ చేసి నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ సినిమాల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తుండడంతో.. లీక్ లతో నిర్మాతలు సతమతమవుతున్నారు.