కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం చాలా దారుణంగా ఉంది. ఊహించని స్థాయిలో వేగంగా విస్తరిస్తూ వైరస్ కోరలు చాస్తోంది. ఎందరో ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో కల్లోలం రేపుతోంది.. ఈ వైరస్ వలన ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడగా, తాజాగా చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌కు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. బుధవారం రోజు కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.
హాస్పిటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపిన కళ్యాణ్ దేవ్ త్వరలోనే మరింత శక్తివంతంగా, ఆరోగ్యంగా వస్తానని స్పష్టం చేశారు. కల్యాణ్ ప్రస్తుతం సూపర్ మచ్చి, కిన్నెర సాని అనే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు అతి త్వరలోనే విడుదల కానున్నాయి.