మొక్కలు నాటిన ప్రగతి రిసార్ట్ యాజమాన్యం..

32
Green India Challenge

ప్రపంచ ధరిత్రి దినోత్సవం (వరల్డ్ ఎర్త్ డే) సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్వర్యంలో ప్రగతి రిసార్ట్ లో యాజమాన్యం మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు కలిసి పెద్ద ఎత్తున వివిధ రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ బారి నుండి త్వరగా కోలుకోవాలని, త్వరగా కరోనావైరస్ అంతం అయి ప్రజలందరూ సుఖంగా ఉండాలని “దక్షిణమూర్తి” ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రగతి రిసార్ట్ చైర్మన్ జీబీకే రావు మాట్లాడుతూ.. భూమిపై పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే మొక్కలు నాటడమే ఒకటే మార్గమని ఎంత పెద్ద ఎత్తున మొక్కలు నాటితే భూమిపై అంత కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నారని ఇది చాలా గొప్ప కార్యక్రమం కాబట్టి భవిష్యత్తులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థతో కలిసి ప్రగతి రిసార్ట్ యాజమాన్యం పని చేస్తుంది అని తెలిపారు.

అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ నుండి త్వరగా కోలుకోవాలని ప్రగతి రిసార్ట్ ప్రాంగణంలో దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రగతి రిసార్ట్ MD అజయ్, డైరెక్టర్ రామకృష్ణ, చీప్ పిఆర్ఓ రవీందర్ ప్రతినిధి కిషోర్ గౌడ్, డాక్టర్ నాగరాజు ,వేణుగోపాల్ ,రమారావు తదితరులు పాల్గొన్నారు.