ఈటల…మేక వన్నె పులి: గంగుల

28
etela

ఈటెల రాజేందర్ మేకవన్నె పులి.….బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటెల అని తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఈటల….సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఈటలకు లేదన్నారు. ముదిరాజులకు చేపపిల్లలు కావాలి అని వైఎస్సార్- కిరణ్ కుమార్ రెడ్డిని అడగలేదు కానీ తన దేవర యంజాల్ భూముల గురించి అడిగారని మండిపడ్డారు.

టీఆర్ఎస్‌ఎల్పీ నేతగా ఆ పదవిని దుర్వినియోగం చేశారు….బీసీ లను దగ్గరకు రానీయలేదు…ఈటెల వ్యాపార భాగస్వామ్యులు కూడా బీసీ లు కారన్నారు. బీసీ లను తొక్కే ప్రయత్నం చేశారు…పదవి ఉన్నప్పుడు కేసీఆర్ ను అడిగినవా చేపలు కావాలి అని ఎద్దేవా చేశారు. పదవి పోగానే బీసీ బిడ్డను- ముదిరాజ్ బిడ్డలు గుర్తుకు వచ్చారా?అని దుయ్యబట్టారు.

కమలాపూర్ నియోజావర్గంలో చీమలుపెట్టిన పుట్టలో పాము లాగా ఈటెల చేరి ప్రయోజనం పొందాడు…ఈటెల కమలాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నేతలను బయటకు పంపే ప్రయత్నం చేశారన్నారు. తక్కువ టైంలో వేల కోట్లు… వందల ఎకరాలు ఎలా సంపాదించావ్ అన్నారు. ఈటెల తనకు తాను ఎక్కువ ఉహించుకున్నాడు.…పార్టీ గెలిస్తే ఈటెల ఏడ్చే వాడు- ఓడితే నవ్వే వాడన్నారు. ఈటెల ప్రతి ఒక్క ప్రతిపక్ష నేతలతో టచ్ లో ఉన్నాడు… ఆరుసార్లు గెలిచింది ఈటెల రాజేందర్ కాదు కేసీఆర్ బొమ్మ గెలిచిందన్నారు.

జమ్మికుంట-హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ లు కేటీఆర్ ను కలవాలి అంటే అడ్డుకున్నావ్…. త్వరలోనే హుజురాబాద్ లో పర్యటన చేస్తాం అన్నారు.పార్టీని మరీంత బలోపేతం చేస్తాం.*ఈటెల మనసులో అంతా విషమే… ఈటెల రాజేందర్ పచ్చి అబద్ధాల కోరు….కెసిఆర్ ఓ లెజెండ్….ఆయన నాయకత్వం లో పనిచేయడం మా అదృష్టం….బీసీ లు ఆత్మగౌరవం తో బతికేలా చేసిన ఏకైక సీఎం కెసిఆర్ మాత్రమే అన్నారు.