ఫైర్‌ మెన్‌ క్రాంతికుమార్‌ని అభినందించిన మెగాస్టార్…

308
allu aravind
- Advertisement -

చిన్నారిని మృత్యువు నుండి కాపాడిన ఫైర్ మెన్ శ్రీ క్రాంతికుమార్‌ను అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. భారీ వర్షాల సందర్భంగా ప్రమాదవశాత్తు గౌలీగూడ (హైదరాబాద్) నాలాలో పడిపోయిన 4సంవత్సరాల దివ్యను ఆదివారం అగ్నిమాపక సిబ్బంది మృత్యువు నుండి కాపాడారని తెలుసుకున్న చిరంజీవి క్రాంతికుమార్‌పై ప్రశంసలు గుప్పించారు.

ఫైర్ మెన్‌ క్రాంతి కుమార్ కు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలు బహుమతిగా అందజేశారు. చిరు తరపున అల్లు అరవింద్…క్రాంతి కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్‌ను శాలువాతో సత్కరించారు. క్రాంతి కుమార్ కు సహకరించిన ఫైర్ సిబ్బందినీ, గౌలిగూడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జయరాజ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు అల్లు అరవింద్.

అదే విధంగా రక్షింపబడ్డ 4సం,,ల బాలికను కూడా ఆదుకుంటామని అల్లు అరవింద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరపున ఆర్. స్వామినాయుడు పాల్గొన్నారు.

- Advertisement -