‘జెర్సీ’తో అది ప్రూవ్ అయ్యింది – నాని

180
Jersey Appreciation meet

నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కుడు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాత‌. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుద‌లైంది. ఈ సినిమా న‌చ్చి ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు హైద‌రాబాద్‌లో సోమ‌వారం సాయంత్రం అప్రిషియేష‌న్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు.

Jersey Appreciation meet

ఈ సంద‌ర్భంగా.. నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ “నాకు ఈ క‌థ విన్న‌ప్పుడే అద్భుతంగా అనిపించింది. సినిమాలో అర్జున్‌కి బీసీసీఐ ఈవెంట్ ప్లాన్ చేసిన‌ట్టు, దిల్‌రాజు అప్రిషియేష‌న్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఆయ‌న‌కు మంచి సినిమా న‌చ్చిన‌ప్పుడు చాలా బాగా ఎంక‌రేజ్ చేస్తారు. సినిమా ఉద‌యం ఆట చూసి దిల్‌రాజు ఫోన్ చేశారంటేనే సినిమా హిట్ అయిన‌ట్టు. ఈ సినిమాకు కూడా ఉద‌యం ఇంటి గేటు నుంచి అడుగు బ‌య‌ట‌పెడుతుంటే దిల్‌రాజు ఫోన్ చేశారు. నాకు క్లారిటీ వ‌చ్చింది.

నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అంద‌రికీ థాంక్స్ చెప్పా. గౌత‌మ్ క‌థ‌లో ఎంత నిజాయ‌తీ ఉందో.. ఆయ‌న‌తో కూడా అంతే హానెస్టీ ఉంటుంది. మ‌న‌సులోనుంచి వ‌చ్చిన జెన్యూన్ క‌థ అయిన‌ప్పుడు త‌ప్ప‌కుండా మేజిక్ క్రియేట్ అవుతుంద‌ని న‌మ్ముతాను. గౌత‌మ్ స్వ‌త‌హాగా చాలా హానెస్ట్ గా ఉన్నాడు. బిగినింగ్ నుంచి ఇప్ప‌టిదాకా అలాగే ఉన్నాడు. `గౌత‌మ్ చాలా పెద్ద డైర‌క్ట‌ర్ అవుతాడు` అని న‌మ్మా. ఫ‌స్ట్ నుంచి చెప్పా. గౌత‌మ్ నాలో అర్జున్‌ని చూసినందుకు థాంక్స్. అన్నారు.