మెగాస్టార్ మూవీలో రంగమ్మత్త

243
anasuya Chiranjeevi

యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన అనసూయ ఈమధ్య వెండితెరపై కూడా తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది. యాంకరింగ్ తో పాటు యాక్టింగ్ లో కూడా చాలా బిజీగా అయిపోయింది అనసూయ . క్షణం మూవీలో ఆమె నటన అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా తర్వాత నుంచి అనసూయకు వరుస ఛాన్స్ లు వస్తున్నాయి. తాజాగా అనసూయ రంగస్ధలం మూవీలో రంగమ్మత్త పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.a

ఈమూవీలో ఆమె నటనకు చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఈసినిమా తర్వాత అనసూయకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ తన తర్వాతి మూవీ మెగా స్టార్ చిరంజీవితో చేయనున్న విషయం తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం సైరా షూటింగ్ లో బిజిగా ఉన్నారు. ఈమూవీ తర్వాత కొరటాల శివతో పనిచేయనున్నాడు మెగాస్టార్. అయితే తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈమూవీలో అనసూయ మరో ముఖ్యమైన పాత్రను పోషించనుందని సమాచారం.

ఇటివలే కొరటాల శివ అనసూయను కలిసి తన పాత్ర గురించి వివరించాడట..మెగా స్టార్ మూవీలో ఛాన్స్ రావడం అంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది అందుకే వెంటనే సైన్ చేసిందట అనసూయ. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన రంగస్ధలం మూవీలో అనసూయ పాత్రకు మంచి పేరు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ తో నటించే అవకాశం రావడంతో అనసూయ త్వరలోనే బిజీ ఆర్టీస్ట్ గా మారుతుందనడంతో ఎటవంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు..