మెగాస్టార్ ను వదలని రాజకీయం!

20
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ప్లాప్ అయ్యారు. సినిమాల్లో హీరో అనిపించుకున్నా, రాజకీయాల్లో మాత్రం జీరోగానే మిగిలారు. ఐతే, ఏపీలో ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబుతో పవన్ జోడీ కట్టారు. మరోవైపు జగన్ ఒంటరివాడై పోయాడు. చాలా మంది నేతలు సైతం జగన్ పార్టీని వీడారు. ఇక వేరే పార్టీలోకి అనుమతి లేని నేతలు, వేరే పార్టీలోకి వెళ్లినా కూడా టికెట్ దక్కడం కష్టమేనని భావించిన నేతలు మాత్రమే జగన్ పార్టీని పట్టుకుని వేలాడుతూ మ్యూట్ లోకి వెళ్లిపోయారు.

ఇక ఇప్పుడు తన పార్టీని గెలిపించుకునేందుకు ఎన్ని మార్గాలున్నాయో.. అన్నింటినీ జగన్ మోహన్ రెడ్డి వెదుకుతున్నారు. ఈ తరుణంలోనే మెగాస్టార్ చిరంజీవి పేరును వినియోగించుకుని జనసేన ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ఇరుకున పెట్టేందుకు యత్నిస్తున్నారు. చక్కగా సినిమాలు చేసుకుంటూ తన పనిలో తాను ఉన్న మెగాస్టార్ చిరంజీవిను రాజకీయాల్లోకి లాగుతున్నారు. గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు తప్ప మరే విషయంలోనూ వేలు పెట్టడం లేదు.

కనీసం తన అమ్మగారిని తూలనాడినప్పుడు సైతం మెగాస్టార్ చిరంజీవి స్పందించలేదు. విపరీతంగా విమర్శలొస్తే ఏదో రెండు ముక్కలు మాట్లాడిన వీడియో రిలీజ్ చేసి సైలెంట్ అయ్యేవారు చిరంజీవి. పవన్ కళ్యాణ్ కి కూడా మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ గా సపోర్ట్ చేయలేదు. ఈ పరిణామాలన్నింటి నడుమ మెగాస్టార్ చిరంజీవిను రాజకీయాల్లోకి లాగితే లబ్ధి చేకూరుతుందని వైసీపీ ప్లాన్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ ను అతని కుటుంబమే పట్టించుకోవడం లేదని, ఇక జనం ఎలా పట్టించుకుంటారు అంటూ ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు.

Also Read:వామ్మో గవదబిళ్లల వ్యాధి.. జాగ్రత్త!

- Advertisement -