మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభం…

50
chiru

కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండేందుకు ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. చిరు ప్రకటించిన అనంతరం శరవేగంగా కార్యక్రమాలు జరుగుతుండగా నేటి నుంచి చిరు ఆక్సిజన్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మిష‌న్ మొద‌లైంది. ఇక ఆక్సిజ‌న్ దొర‌క్క చనిపోయార‌నే వార్త‌లు మ‌నం విన‌కూడ‌దు అంటూ చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

అనంతపూర్,గుంటూరు జిల్లా కేంద్రాలలో చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక జూన్ 27(రేపటి) లోగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.