నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నా: అమ్మతో చిరు

44
chiru

తన తల్లి పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగంతో శుభాకాంక్షలు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. రెండోసారి కరోనా బారిన పడటంతో ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు చిరు. ఈ నేపథ్యంలో ఇవాళ తన మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

అమ్మా… జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు, మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ.. అభినందనలతో… శంకరబాబు అని ట్వీట్ చేశారు.