రికార్డు సృష్టిస్తున్న చిరు ఖైదీ ట్రైలర్‌….

238
- Advertisement -

దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి సినిమాపై భారీ అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈసినిమా ప్రీ రిలీజ్‌ ఆడియో చూస్తేనే అర్ధమమైపోయింది చిరంజీవి ఇమేజ్‌ ఏంటో అని. ఇక ఈ వేడుకలో చిరంజీవి ప్రసంగిస్తూ ఉంటే మెగా అభిమానుల్లో ఆనందం హద్దులు లేకుండా పోయింది. అయితే ఇప్పటికే ఈసినిమా పాటలు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తుంది… ఏ హీరో సాధించలేని రికార్డులను ఖైదీనెంబర్‌150 తన సొంతం చేసుకుంది. ఎక్కడ చూసినా అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు అని వినిపిస్తుంది.

CHIRANJEEVI KHAIDI NO. 150 trailer

నిన్న జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఖైదీ నెంబర్‌150 ట్రైలర్‌ను రిలీజ్‌ చేసి మరో సంచలనం సృష్టించాడు మెగాస్టార్‌. రిలీజ్‌ చేసిన గంట వ్యవధిలోనే 10లక్షల వ్యూస్‌ వచ్చాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ వ్యూస్‌ రెండు మిలియన్లను దాటిపోయింది. రిలీజ్‌కు ముందే యూట్యూబ్‌లో రికార్దులను సృష్టిస్తున్న ఖైదీనెంబర్‌150 ట్రైలర్‌ ఇక రిలీజ్‌ తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృషిస్తుందో వేచిచూడాల్సిందే. ఈ సినిమా జనవరి11న రిలీజ్‌ కాబోతున్న విషయం తెలిసిందే అయితే సంక్రాంతి బరిలో ఇద్దరు పెద్ద హీరోలు పోటీ పడుతుండడంతో అభిమానుల్లో ఉత్కఠ నెలకొంది. ఇద్దరి హీరోల మధ్య స్నేహాం బంధం బాగానే ఉన్నప్పటికీ ఈపోటీ తో వారు కాస్త ఇబ్బంది గురికావల్సి వస్తుందని పలువురు సినీ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

CHIRANJEEVI KHAIDI NO. 150 trailer

ఈ ఆడియో వేడుకల్లో చిరంజీవి మాట్లాడుతూ…..‘‘సరిపోవడం లేదు. ఈలలు.. చప్పట్లు విని చాలా సంవత్సరాలు అయింది. వీటికి ఎంత శక్తి ఉన్నది అనుభవపూర్వకంగా తెలిసిన వాడిని. మీ నుంచి మరింత ఉత్సాహం కావాలి. దాని కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూసి ఇప్పుడు మీ ముందుకు వచ్చానన్నారు.‘బాస్‌ కమ్‌ బ్యాక్‌’ అంటూ పెద్ద ఎత్తున మీరు పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ పది సంవత్సరాల వ్యవధిలో నన్ను మీ గుండెలకు అతి దగ్గరగా ఉంచుకుని అక్కున చేర్చుకుని ఇంత ప్రేమ చూపిన ఆ శక్తి పేరు అభిమానం అన్నారు.

 

- Advertisement -