ధోనిఫోటోపై సెహ్వాగ్ కామెంట్..

133
segwag

భారతక్రికెట్ అంశాలపై ఎప్పటికప్పుడు ట్వీట్టర్ ద్వారా స్పందించే మాజీ క్రికెటర్ విరేందర్ సెహ్వాగ్‌ మరోసారి తనదైన స్టైల్లో కామెంట్ చేశాడు. భారత వన్డే ..టీ ట్వంటీ జట్టు కెప్టెన్సీని నుంచి ఎమ్‌ఎస్ ధోని తొలిగిపోవడంతో..ఆ బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ..ఎమిరేట్స్ 247.కామ్ సంస్థ ట్వీట్లర్ లో పోస్ట్ చేసింది. అయితే అక్కడ సదరు డాట్ కామ్ సంస్థ ఓ చిన్న తప్పిదం చేసింది. ధోని స్థానంలో బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్పుత్ ఫోటోను పోస్ట్ చేసింది. ఎంఎస్ ధోని-ద అన్ టోల్డ్ స్టోరీ’ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన సుశాంత్ ఫోటోను విరాట్ కోహ్లి పక్కన పెట్టి పోస్ట్ చేసింది. దీనిపై సెహ్వాగ్ సెటైర్లు గుప్పించాడు.

https://twitter.com/Emirates247/status/817618975584436224

ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్లో ప్రయాణించడానికి తన స్థానంలో మరొక వ్యక్తిని పంపిచలేరు కదా.. అటువంటప్పుడు ధోని స్థానంలో రాజ్పుత్ ఫోటోను ఎందుకు పోస్ట్ చేశారు అంటూ సెహ్వాగ్ నిలదీశాడు. ఈ మేరకు దాదాపు తనను పోలిన మరో వ్యక్తి ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి మరీ ఆ వెబ్ సైట్కు కౌంటర్ ఇచ్చాడు. ఇలా ఎమిరేట్స్ 247.కామ్ చేసిన చిన్నపాటి తప్పిదాన్ని ఎత్తి చూపాడు. దీనిపై సెహ్వాగ్ సీరియస్‌గా వ్యాఖ్యనించకుండా తనదైన  స్టైల్లో నవ్వు తెప్పించేలా  వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.