కొత్త చరిత్ర సృష్టించిన దంగల్‌..

111
aamir

బాలీవుడ్ లో రికార్డుల గురించి ప్రస్తావిస్తే..ముందుగా చెప్పాల్సిన పేరు మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్‌. ఆకట్టుకునే కథ..దానికి సరితూగేలా ఆమిర్ నటన ఇవన్నీ మిస్టర్‌ పర్ఫెక్ట్ కు రికార్డులను తెచ్చిపెడతాయనడంలో ఎలాంటి సందేహాం లేదు. పీకే సినిమాతో ఇప్పటికే బాలీవుడ్ లో హైయ్యేస్‌ గ్రాసర్ గా నిలిచిన అమీర్.. దంగల్ సినిమాతో కొత్త చరిత్రను సృస్టించాడు. ఆమిర్ నటించి, నిర్మించిన ‘దంగల్‌’ సినిమా భారీ వసూళ్లతో బాలీవుడ్‌ రికార్డులను తిరగరాసింది. ‘పీకే’ సినిమా రికార్డులను బద్దలుకొడుతూ స్వదేశంలో అత్యధిక గ్రాస్‌ కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా ‘దంగల్‌’ అవతరించిది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.341.96 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్లు సాధించింది.

dangal

2014లో వచ్చిన ‘పీకే’ సినిమా భారతదేశంలో మొట్టమొదటిసారి 300 కోట్ల మైలురాయిని దాటిన చిత్రంగా నిలిచింది. రూ.340.8 కోట్ల కలెక్షన్లతో పీకే హయ్యెస్ట్‌ గ్రాసర్‌గా నలవగా, భజరంగీ భాయిజాన్‌- రూ.320.34 కోట్లు, సుల్తాన్‌- రూ.300.67 కోట్లు తర్వాతి స్థానాల్లో నలిచాయి. ఇప్పుడు దంగల్‌ రూ.341.96 కోట్ల వసూళ్లతో టాప్‌ పొజిషన్‌కు చేరింది. ఇప్పటివరకు దేశీయంగా 300 కోట్లపైచిలుకు కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాలు 4. వాటిలో రెండు ఆమిర్‌వికాగా, మరో రెండు సల్మాన్‌సినిమాలు. ‘దంగల్‌’ రోజువారీ కలెక్షన్లు ఇలా ఉన్నాయి..