వాల్తేరు వీరయ్య సినిమా సెట్ మీద వుండగానే సీనియర్ హీరో చిరంజీవి తరువాత సినిమా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వం లో రాబోతున్న సినిమా కోసం ఒక్కో ఏర్పాటు జరిగిపోతోంది. వాస్తవానికి ఈ సినిమా ఈ డిసెంబర్ లోనే మొదలు కావాల్సి వుంది. కానీ, వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా అలా పక్కన వుండాల్సి వచ్చింది. అయితే మరింత ఆలస్యం కాకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండ్ చిరంజీవి లేని సీన్స్ చిత్రీకరణను చకచకా ఫినిష్ చేసేస్తున్నారు దర్శకుడు మెహర్ రమేష్.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గెటప్ ఎలా వుండాలి అనే దాని మీద మూడు రకాల స్కెచ్ లు వేయించి, వాటికి అనుగుణంగా కాస్ట్యూమ్స్ ను చేయిస్తున్నారు. మెగాస్టార్ సినిమాలకు ఇది చాలా కీలకం. కాస్ట్యూమ్స్ సెట్ అయితే చిరంజీవి లుక్ బాగుంటుంది. కాస్ట్యూమ్స్ సెట్ కాక మెగాస్టార్ లుక్ ఫెయిల్ అయిన సందర్భాలు కూడా వున్నాయి. ఇదిలా వుంటే సినిమాలో కీలకమైన విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను తీసుకుంటున్నారు.
మెగాస్టార్ సినిమాలో విలన్ గా చేయడానికి సంజయ్ దత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇక మిగలింది హీరోయిన్ పాత్ర. దీని కోసం వేట సాగుతోంది. కాస్త థర్టీ ప్లస్ లా కనిపించే పాత్ర కావడంతో ఎవరు సెట్ అవుతారు అని డిస్కషన్లు సాగుతున్నాయి. గతంలో చిరంజీవి పక్కన నటించిన త్రిష అయితే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నారు. మరీ ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి. మొత్తమ్మీద సినిమాల పరంగా మెగాస్టార్ ది ‘చిరు’త వేగం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…