చిరంజీవి ఇంటికి కేంద్రమంత్రి…

26
- Advertisement -

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. చిరంజీవి ఇంటికి వెళ్లి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్‌పై సుదీర్ఘంగా చర్చలు కొనసాగించారు. ఈ చర్చల్లో భాగంగా యువసామ్రాట్ నాగర్జున ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి కేంద్ర మంత్రి సన్మానించిన ఫోటోలను చిరంజీవి ట్వీట్టర్ ద్వారా షేర్ చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ…మా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదములు అలాగే భారత చలన చిత్ర పరిశ్రమ గురించి నా సోదరుడు నాగార్జునతో కలిసి మీతో జరిపిన చర్చించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అయితే దీనిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో గుసగుసలు మొదలైనవి. దీన్నిపై పూర్తిగా రాజకీయ కోణం నుంచి సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ తమన్నా కీలకపాత్రలో నటిస్తున్నారు. మెహర్ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా సిస్టర్‌ సెంటిమెంట్‌ కథనం సాగేలా ఉందని మొదటి నుంచి టాలీవుడ్‌ టాక్‌.

ఇవి కూడా చదవండి…

పిక్ టాక్ : ఛాన్స్ ల కోసమే బరితెగింపు

ఓటీటీ : ఏ చిత్రం దేనిలో ?

రావణాసుర..షూటింగ్ పూర్తి

- Advertisement -